రైతులను పట్టించుకోని మూర్ఖపు సీఎం కేసీఆర్ : బండి

by Shyam |
Bandi-sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు అల్లాడిపోతున్నా పట్టించుకోని మూర్హత్వపు సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.‘రాష్ట్రంలో రైతు బతుకు మారలేదు.. కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్‌లో పడుకొని ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నానని చెబుతున్నాడని, అసలు కేసీఆర్ ఫౌంహౌజ్‌లో ఏం పండిస్తున్నారు? అంత డబ్బు ఎలా సంపాదించడం సాధ్యం? గంజాయి ఏమైనా పండిస్తున్నారా’ అన్న అనుమానం కలుగుందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూసార పరీక్షల కోసం రూ.120 కోట్లు కేంద్రం మంజూరు చేస్తే… టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రామంలో కూడా భూసార పరీక్షలు నిర్వహించలేదని, కేసీఆర్ మాత్రం భూసార పరీక్షలు చేయించుకొని దొడ్డుబియ్యం పండిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు మాత్రం ఆయన మాటలు నమ్మి సన్న వడ్లు పండించి దారుణంగా మోసపోయారని మండిపడ్డారు. తెలంగాణలో రైతు సుభిక్షంగా లేడని, ప్రత్యేక రాష్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు పడుతున్నాయని, జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అకాల వర్షాలతో దారుణంగా నష్టపోయారని, నష్టం అంచనా పేరిట కమిటీలు వేశారే తప్ప రైతులను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. సమస్యను దృష్టి మళ్లించడానికే కేసీఆర్ రోజుకో కొత్త సమస్యను తెరమీదకు తీసుకొస్తూ నాటకాలాడతున్నాడని మండిపడ్డారు.

రుణమాఫీ చేస్తానని ప్రగల్బాలు పలికిన సీఎం మాటలకే పరిమితమయ్యారని, రైతు బంధు సొమ్ము రైతులకు ఉపయోగపడకుండా పోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అద్భుతాలు సృష్టిస్తానని రైతులను ప్రగతి భవన్ కు పిలిచిన కేసీఆర్… ఉచితంగా ఎరువులు ఇస్తానని మోసం చేశారన్నారు. కేంద్రం ఏటా ఎరువుల సబ్సిడీ పేరిట రూ.60వేల కోట్లు చెల్లిస్తుందని, కానీ రాష్ట్రంలో రైతులకు ఎరువులు ఉచితంగా ఇచ్చిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed