- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించిన ఆర్థిక మంత్రి!
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత ప్రారంభమవుతున్న ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అనుకున్న స్థాయిలో వడ్డీ రేట్లను బదిలీ చేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2019 ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఆర్‌బీఐ 185 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేట్లను తగ్గించడంతో రెపో రేటు 4 శాతానికి వచ్చింది. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు కేవలం 140 బేసిస్ పాయింట్లను మాత్రమే బదిలీ చేశాయని చెప్పారు. అలాగే, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌లో పరిశ్రమలకు రుణాల మంజూరును మరింత వేగవంతం చేయాలని చెప్పారు. అయితే, ప్రభుత్వం సూచించిన వడ్డీ రేట్లను బదిలీ చేయడం సులభం కాదని ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. బ్యాంకులు లాభనష్టాలను అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని, డిపాజిటర్లు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించకుండా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం సరైన విధానం కాదని ఆయన వివరించారు.