- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దైవదూతపై చిదంబరం విసుర్లు
by Anukaran |
X
న్యూఢిల్లీ: దేవుడి చర్యలతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదమున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటర్ ఇచ్చారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించకముందు 2017-18, 2018-19, 2019-20కాలంలో ఆర్థిక వ్యవస్థ దుస్థితికి దైవదూతగా ఆర్థిక మంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి దేవుడి చర్య అయితే, ఈ వైరస్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ దుస్థితిని ఎలా వర్ణిస్తారని ట్వీట్ చేశారు.
జీఎస్టీ బకాయిలకు సరిపడా అప్పు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరడంపైనా ఆయన అభ్యంతరం చెప్పారు. కేంద్రం ఇచ్చిన రెండు అవకాశాలూ రాష్ట్రాలపై భారం మోపేలానే ఉన్నాయని విమర్శించారు. ఆర్థిక బాధ్యతలు తీసుకోవడానికి కేంద్రం ఎల్లప్పుడూ నిరాకరిస్తూనే ఉన్నదని ఆరోపించారు. ఇది మోసమని, చట్ట ఉల్లంఘనేనని విమర్శించారు.
Advertisement
Next Story