- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పువ్వుల గిరాకీ.. రైతును నిలబెట్టింది
దిశ, వికారాబాద్: ఆ రైతు పొగొట్టుకున్న చోటనే వెతుక్కున్నాడు. 23ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నా నష్టాలు రావడంతో పూలసాగుపై దృష్టి సారించాడు. వ్యవసాయాధికారుల సూచనలతో మేలైన చామంతి, బంతి నారు పోసి పంటను కంటికి రెప్పలా పెంచాడు. ఎకరంన్నర పొలంలో చామంతి, బంతి సాగు చేశాడు. పండుగలు, శుభకార్యాల సీజన్కావడంతో మార్కెట్లో పూలకు భలే డిమాండ్ఉంది. కేవలం రూ.1.5లక్షల పెట్టుబడితో రూ.10లక్షల వరకు లాభాలు ఆర్జించినట్లు వికారాబాద్జిల్లా పులుసుమామిడి గ్రామానికి చెందిన కేశపల్లి మహేందర్రెడ్డి పేర్కొన్నాడు.
దసరా, దీపావళి పండుగలు వస్తే చాలు పూలకు భలే గిరాకీ ఉంటుంది. పూజా కార్యక్రమాలు, శుభకార్యాలకు పూలు ఎంతో అవసరం. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడి, కొట్టాల గూడ, గిరి గేట్ పల్లి గ్రామాల్లో కూరగాయలతో పాటు పూలసాగును రైతులు అత్యధికంగా సాగు చేస్తారు. ఇందులో భాగం గానే పులుసుమామిడి గ్రామానికి చెందిన కేశవపల్లి మహేందర్ రెడ్డి తనకున్న ఎకరంన్నర పొలంలో చామంతి పూలు, మునగ తోటను సాగుచేశారు. ప్రస్తుతం పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
పూలసాగు మేలు..
పూల సాగు ఎంతో మేల ని రైతు కేశపల్లి మహేందర్రెడ్డి తన అనుభవాన్ని ‘దిశ’తో పంచుకున్నారు. ఎకరంనర వ్యవసాయ పొలంలో 23 ఏళ్లుగా టమాట సాగు చేయగా ఆశించిన మేర దిగుబడి రాలేదు. తీవ్ర నష్టం రావడంతో పంట మార్పిడి పద్ధతి పాటిస్తే మంచిదని వ్యవసాయాధికారులు సూచిం చారు. కూరగాయ పంటలకు బదులుగా పూలతోట సాగు చేయాలని నిశ్చయానికి వచ్చాడు. శంషాబాద్ లోని వెంకట్రెడ్డి నర్సరీలో బాలు వైట్2, ఎల్లో రెండు రకాల చామంతి నారును తీసుకు వచ్చి సాగు చేశారు. పంట సాగు కాలం ఐదు నెలలు కాగా, నాటిన 150 రోజుల్లో చామంతి తోట కాపునకు వస్తుంది. వర్షాకాలంలో కీటకాలు దరిచేరకుండా ఆరు నుంచి ఎనిమిది రోజులకోసారి ఫర్టిలైజర్ మందులతోపాటు బయో మందులను పిచికారీ చేశారు. కాపు వచ్చిన నాటి నుంచి ఐదు నెలల పాటు పూలు విక్రయించవచ్చు. ప్రస్తుతం పొలంలో పండిన పూలను హైదరాబాద్మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఎరువులు, పిచికారీ మందులతోపాటు చామంతి పూలతోటలో కలుపు తీసేందుకు కూలీలకు సుమారు ఇప్పటివరకు రూ.లక్ష వరకు పెట్టుబ డి పెట్టారు. పూలు కోసేందుకు బొమ్మరాసిపేట మండలం నుంచి కూలీలు వస్తారు. ఒక్కో కూలీకి రూ.300 వరకు చెల్లిస్తారు. ఇప్పటి వరకు పూల విక్రయంతో సుమారు రూ.7 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు రైతు మహేందర్రెడ్డి తెలిపారు.
పంట దిగుబడి బాగుంది: రైతు మహేందర్రెడ్డి
పంట మార్పిడితో పూల తోటలు సాగు చేశా. కూరగాయల కు బదులుగా చామంతి సాగు చేశా. ఇప్పటి వరకు సుమారు రూ.7 లక్షల ఆదాయం వచ్చింది. మరో రూ.4లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ బావిలో నీటిని డ్రిప్ సహాయంతో పంటలకు అందిచాం. కూరగాయ పంటల కంటే పూల తోటలతోనే అధిక దిగుబడులు వస్తున్నాయి. మరో రెండు ఎకరాల్లో చామంతిని నాటేందుకు సిద్ధం చేశా.