ఎస్సారెస్పీకి పెరిగిన వరద

by Shyam |
ఎస్సారెస్పీకి పెరిగిన వరద
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఒక మీటర్ వరకు వరద నీరు వచ్చి చేరుతుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జూలై 1 బాబ్లీ గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1074.20 అడుగులకు గాను 37.844 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఏఈ జగదీష్ తెలిపారు. ప్రస్తుతం బాబ్లీ నుంచి 26,287 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతున్నది. ఎగువన విష్ణుపురి గేట్లను ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. ఇప్పుడు వస్తున్న 26 వేల క్యూసెక్కులు వరద మొదటి సారి వస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed