అరవింద్ ఫ్యాషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ మైనారిటీ వాటా కొనుగోలు

by Harish |
అరవింద్ ఫ్యాషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ మైనారిటీ వాటా కొనుగోలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రముఖ దుస్తుల డెనిమ్ బ్రాండ్‌గా ఉన్న ఫ్లయింగ్ మెషిన్‌ను సొంతం చేసుకున్న టెక్స్‌టైల్స్ కంపెనీ అరవింద్ ఫ్యాషన్స్‌లో వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ మైనారిటీ వాటా కొనుగోలు చేసింది. అరవింద్ ఫ్యాషన్స్ అనుబంధ సంస్థకు చెందిన అరవింద్ యూత్ బ్రాండ్స్‌లో మైనారిటీ వాటా కోసం ఫ్లిప్‌కార్ట్ రూ. 260 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో భారత్‌లోని ఫ్యాషన్‌ను, యువతకు నచ్చే బ్రాండ్‌ల డిమాండ్‌ను మెరుగుపరిచేందుకు వినియోగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, అరవింద్ ఫ్యాషన్స్ భాగస్వాయం కుదిరింది.

అరవింద్ యూత్ బ్రాండ్స్‌లో మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిందని అరవింద్ ఫ్యాషన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ పెట్టుబడి రాకతో ఆకర్షణీయమైన, నాణ్యమైన ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు, సంస్థ అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని అరవింద్ ఫ్యాషన్స్ కంపెనీ వెల్లడించింది. అరవింగ్ ఫ్యాషన్స్‌తో భాగస్వామ్యంపై ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఫ్లయింగ్ మెషిన్ భారత్‌లోని యువతలో బాగా క్రేజ్ ఉన్న బ్రాండ్. ఈ పెట్టుబడుల ద్వారా దీన్ని మరింత విలువైన బ్రాండ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తామని, గత దశాబ్దాలుగా ఉన్న బలమైన బ్రాండ్ విలువను అభివృద్ధి చేస్తామని’ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed