- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Flipkart : పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ నేపథ్యంలో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. తన కస్టమర్ల కోసం ప్రారంభించిన ‘పే లేటర్ ఈఎంఐ’ క్రెడిట్ పరిమితిని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాన్ని ఇస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఆఫర్ కింద ఇప్పటివరకు ఉన్న క్రెడిట్ పరిమితిని రూ. 10,000 నుంచి ఏకంగా రూ. 70,000కి పెంచుతున్నట్టు పేర్కొంది. తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు 3 నెలలు, 6 నెలలు, 9 నెలకు, ఏడాది కాలవ్యవధి సౌకర్యం ఉంటుంది. అలాగే, ఈ క్రెడిట్ ఆఫర్ ఇప్పటివరకు 10 కోట్ల మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, దీన్ని అందరికీ వర్తించేలా మార్పులు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. పండుగ సీజన్ కావడంతో వినియోగదారుల అవసరాలను గుర్తించి క్రెడిట్ లిమిట్ పెంచామని, పే లేటర్ ద్వారా తీసుకున్న మొత్తాన్ని ఈఎంఐ పద్దతిలో చెల్లించే అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపింది. 10 కోట్ల మంది తర్వాత క్రెడిట్ కావాల్సిన వారు సంబంధిత సమాచారాన్ని అందించడం ద్వారా ఆఫర్‌ను వినియోగించవచ్చు.