- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్ ఘనత సాధించిన ఫ్లిప్‌కార్ట్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా తన ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో ఉపయోగిస్తున్న అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తొలగించినట్టు వెల్లడించింది. 2021 నాటికి సరఫరా వ్యవస్థలో ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్ నిర్వహించాలని ప్రకటించిన లక్ష్యాన్ని చేరుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌కున్న మొత్తం 70 కేంద్రాల్లో ప్యాకేజి చేసేందుకు ఎలాంటి ప్లాస్టిక్‌ను వినియోగించబోమని పేర్కొంది. పర్యావరణానికి మేలు చేసే కాగితం, రీ-సైక్లింగ్ పేపర్ బ్యాగులు, బబుల్ వ్రాప్‌లను ఇకపై ప్యాకేజీ ప్రక్రియలో వాడనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ‘కొవిడ్ మహమ్మారి సవాళ్లను అధిగమిస్తూ తాము పూర్తిగా వందశాతం ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్ ఘనతను సాధించడం సంతోషంగా ఉందని’ ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్, సరఫరా విభాగం హెడ్ హేమంత్ బద్రి చెప్పారు.