జట్టును కాపాడేందుకు బలైన స్మిత్..

by vinod kumar |
జట్టును కాపాడేందుకు బలైన స్మిత్..
X

ఆస్ట్రేలియా జట్టు 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం కారణంగానే అప్పుడు ఆసీస్ కెప్టెన్‌‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్‌ ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా, ఆనాటి ఉదంతం గురించి తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ స్పందించాడు. ‘కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు సభ్యులందరికీ తెలియకుండా బాల్ ట్యాంపరింగ్ జరిగిందని నేను అనుకోవట్లేదు, కేవలం జట్టులోని మిగతా సభ్యులను కాపాడేందుకే స్మిత్ తప్పంతా తనపై వేసుకున్నాడని’ ఫ్లింటాఫ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఎవరైనా బాల్ ట్యాంపరింగ్‌ చేసినట్టయితే, ఆ బంతి మన చేతికి వస్తే కనుక తప్పకుండా ఆ విషయం తెలిసిపోతుంది. ముఖ్యంగా ఒక బౌలర్‌కు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అలాంటప్పుడు ఆ బంతితో బౌలింగ్ చేసిన బౌలర్లకు ట్యాంపరింగ్ గురించి తెలియదా? అని ప్రశ్నించాడు.

ఆస్ట్రేలియా జట్టు ఎప్పటి నుంచో బాల్ ట్యాంపరింగ్ వివాదాల్లో ఉంది. ‘బాల్‌కు సన్ క్రీమ్ రాయడం, ఉమ్మి రాయడం వంటి అనేక పద్ధతుల్లో ట్యాంపర్ చేస్తారు. ఆస్ట్రేలియా జట్టు సభ్యులు ఏదో ఒక రూపంలో ట్యాంపరింగ్‌లో భాగస్వామ్యులు కాలేదంటే నేను నమ్మను’ అని ఫ్లింటాప్ అన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా కొన్ని సార్లు బాల్ ట్యాంపర్ చేసిందనే విషయాన్ని బయటపెట్టాడు. కానీ, ఆ వివరాలను పూర్తిగా పంచుకునేందుకు అతను ఆసక్తి చూపలేదు.

Tags: Ball Tampering, Andrew Flintoff, Steve Smith, David warner, Australia

Advertisement

Next Story

Most Viewed