శ్రేయాస్ అయ్యర్ ను ర్యాగింగ్ చేసిన పంజాబ్ ప్లేయర్ !

by Veldandi saikiran |
శ్రేయాస్ అయ్యర్ ను ర్యాగింగ్ చేసిన పంజాబ్ ప్లేయర్ !
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ( Shreyas Iyer ) ఇమిటేట్ చేశాడు ఆ జట్టు యంగ్ ప్లేయర్ ముసీర్ ఖాన్ ( Musheer Khan). అచ్చం శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎలా చేస్తాడు... అలాగే ఎలా నడుస్తాడనే దాన్ని కళ్లకు కట్టినట్టు ఇమిటేట్ చేసి మరీ చూపించాడు ముషీర్ ఖాన్. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ( Rajathan Royals ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మన శనివారం ఈ రెండు జట్ల మధ్య 18 వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

సొంత గడ్డ పైన పంజాబ్ కింగ్స్ ఆ రోజున ఓడిపోయింది. ఓటమి అనంతరం... పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ ప్రీతి జింటా ( Preity Zinta ).. తమ ప్లేయర్లను మోటివేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఇలా ఉండగా... ఈ మ్యాచ్ తర్వాత జరిగిన సంఘటన తాజాగా వైరల్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్.. పంజాబ్ ప్లేయర్ ముషీర్ ఖాన్ మధ్య జరిగిన సంఘటన... తాజాగా వైరల్ అయింది.

యశస్వి జైస్వాల్ కోరిక మేరకు.. శ్రేయస్ అయ్యర్ ను ఇమిటేట్ చేశాడు ముషీర్ ఖాన్. శ్రేయస్ అయ్యర్ ను అచ్చు గుద్దినట్లే... ముషీర్ ఖాన్ ఇమిటేట్ చేసి చూపించాడు. ఈ వైరల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసినా నెటిజెన్స్, క్రికెట్ అభిమానులు ఫీదా అవుతున్నారు. ముషీర్ ఖాన్ ఇమిటేట్ కూడా బాగా చేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే ముషీర్ ఖాన్ అన్న సంగతి తెలిసిందే.


Next Story