- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓటీటీల్లో ఈవారం బ్లాక్‍బస్టర్ చిత్రాల సందడి.. అవి ఇవే!

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం చాలామంది ప్రేక్షకులకు థియేటర్స్ కి వెళ్ళి మూవీ చూసే ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. కొత్త సినిమా ఎప్పుడూ ఓటీటీ రిలీజ్ అవుతుందా.. ఎప్పుడూ చూసేద్దాం అంటూ ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ కంటే ఓటీటీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీనికి తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను, వెబ్ సిరీస్ లు ప్రతి వారం విడుదల చేస్తున్నాయి. ఇక ఈ వారం బ్లాక్ బస్టర్ చిత్రాలు ఓటీటీలోకి సందడి చేయడానికి రెడీ గా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి విడుదలయ్యే బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.
తెలుగు లీగల్ డ్రామా సినిమా ‘కోర్ట్’ ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. మలయాళ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రావింకూడు షప్పు చిత్రం ఏప్రిల్ 11వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. బాసిల్ జోసెఫ్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది.హారర్ థ్రిల్లర్ సినిమ చోరీ 2 సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ‘ఛావా’ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు ఉన్నాయి. తమిళ కామెడీ డ్రామా సినిమా ‘పెరుసు’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన కింగ్‍స్టన్ సినిమా జీ5 ఓటీటీలో ఏప్రిల్ 13వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం పైన్‍కిలి ఏప్రిల్ 11వ తేదీన మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.