- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయుధ దళాల త్యాగాన్ని స్మరించుకోవాలి : గవర్నర్
దిశ, ఏపీ బ్యూరో : దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాల సేవలను నిరంతరం స్మరించుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలోని రాజ్భవన్లో సోమవారం సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా దేశ రక్షణలో అశువులు బాసిన వీర జవాన్ల కుటుంబ సభ్యులను గవర్నర్ సన్మానించారు. మాతృభూమి రక్షణలో సైనికులు చూపిన ధైర్య సాహసాలను పతాక దినోత్సవ వేడుకలు గుర్తుచేస్తాయని గవర్నర్ ప్రస్తుతించారు.
భారతావని రక్షణ కోసం రాష్ర్టం నుంచి ఎందరో వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారన్నారు. పతాక దినోత్సవ నిధికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా సహకారం అందించడానికి అంగీకరించిన ప్రభుత్వ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన విశాఖకు చెందిన సమ్మింగి తులసీరామ్ భార్య, వీరనారి రోహిణికి గవర్నర్ నగదు పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో అంతరంగిక శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ కుమార్, రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు సంచాలకులు ఎండీ హసన్ రేజా, సహాయ సంచాలకులు వీవీ రాజా రావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.