- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అంబులెన్స్‌లకు న్యాయమైన చార్జీలు’
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్లను తరలించే అంబులెన్స్ సర్వీసులకు సమంజసమైన చార్జీలు నిర్ణయించాలని రాష్ట్రాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా సరిపడా అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. కరోనా అనుమానితులు లేదా పేషెంట్ల తరలింపునకు అంబులెన్స్ సర్వీసులు అందిస్తున్నవారు భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్రాలు తప్పకుండా న్యాయమైన చార్జీలు ఫిక్స్ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు సహా అన్ని అంబులెన్స్‌లు నిర్ధారించిన చార్జీలనే తీసుకోవాలని తెలిపింది. అంబులెన్స్ సర్వీసులు అందిస్తున్నవారు పేషెంట్ల నుంచి రూ. 7వేలు మొదలు 50వేల వరకు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. ప్రతిజిల్లాకు అంబులెన్స్‌లు అందించాలని రాష్ట్రాలకు సూచించింది. అంబులెన్స్‌లను పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలనిచ్చింది.