ఐదేళ్లయిన రాని ఆఫీస్.. ఆందోళనకు దిగుతామన్న కాంగ్రెస్

by Shyam |
congress
X

దిశ, హుస్నాబాద్: రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పడి ఐదేళ్లు గడుస్తున్న ఆర్ అండ్ బీ కార్యాలయం రాలేదని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలోని నాగరం రోడ్డు, అక్కన్నపేట రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రధాన రహదారులు దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు, వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని అధికారులు ఎమ్మెల్యే సతీష్ కుమార్, మంత్రి హరీష్ రావు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజితల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి గుంతలు పడిన రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పక్షాన పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు సత్యనారాయణ, హాసన్, మండలాధ్యక్షులు అక్కు శ్రీనివాస్, చందు, కౌన్సిలర్లు స్వర్ణలత, సరోజన, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story