ఢిల్లీ నుంచి బెంగళూరుకు.. ఒంటరిగా వచ్చిన ఐదేళ్ల బాలుడు

by Shamantha N |
ఢిల్లీ నుంచి బెంగళూరుకు.. ఒంటరిగా వచ్చిన ఐదేళ్ల బాలుడు
X

లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో రెండు నెలలుగా ఆగిపోయిన దేశీయ విమాన సర్వీసులు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే బెంగళూరు విమానాశ్రయంలో పసుపు రంగు కోటు, పసుపు రంగు మాస్క్, నీలం రంగు గ్లౌజులు వేసుకుని, చేతిలో స్పెషల్ కేటగిరీ టికెట్ పట్టుకుని నిల్చున్న ఓ ఐదేళ్ల బాలుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతని పేరు విహాన్ శర్మ. ఢిల్లీ నుంచి బెంగళూరుకి ఒంటరిగా విమానంలో వచ్చాడు. స్పెషల్ కేటగిరీ కింద కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన విహాన్, దాదాపు మూడు నెలల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు.

ఈ రోజు (సోమవారం) ఉదయం 9 గం.ల వరకు బెంగళూరు విమానాశ్రయానికి ఐదు విమానాలు వచ్చాయి. వాటిలో ఒకదానిలో ఇక్కడికి చేరుకున్న విహాన్.. ఆరోగ్య పరీక్షలన్నింటికీ ఒక్కడే హాజరయ్యాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక తల్లికోసం బయట ఎదురుచూస్తున్నపుడు మీడియాకు కనిపించాడు. అతన్ని ప్రశ్నించేలోగానే.. తల్లి దగ్గరికి వచ్చి వివరాలన్ని చెప్పి అతన్ని తీసుకెళ్లింది. అయితే విహాన్‌ను చూడగానే తల్లి ఉద్వేగానికి గురైంది. పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది.

Advertisement

Next Story

Most Viewed