- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాచారం దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: నాచారంలో వృద్దురాలిపై హత్యాయత్నం చేసి దోపిడీకి పాల్పడిన కేసులో నిందితులను అరెస్టు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ పోలీసుల సమన్వయంతో మల్కాజిగిరి సీసీఎస్, ఎస్ఓటీ, ఐటీ సెల్, నాచారం పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా నలుగురు పరారీలో ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాచారం హెచ్ఎంటీనగర్‌లో నివసించే చిత్తపులుసు ప్రదీప్ కుమార్ ఓ ఏజెన్సీ ద్వారా నేపాల్‌కు చెందిన అర్జున్ బహదూర్, మాయ దంపతులను ఇంట్లో పనికి చేర్చుకున్నాడు. ఈనెల 19న ప్రదీప్ కుమార్ తన కుమారుడితో పాటు కార్యాలయానికి వెళ్లగా అదే రోజు ఓ శుభకార్యం నిమిత్తం ప్రదీప్ భార్య, అతని కుమార్తె మెదక్ వెళ్లారు. 70ఏళ్ల వృద్దురాలు ఇంట్లో ఉంది.
ఇదే అదునుగా భావించిన దంపతులు వృద్దురాలికి టీలో నిద్ర మాత్రలు వేసి హత్యాయత్నం చేశారు. అనంతరం 18తులాల బంగారం, 40తులాల వెండి, రూ.10లక్షల నగదుతో ఉడాయించారు. అదేరోజు రాత్రి 9గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న కుమారుడు తల్లి స్పృహా కోల్పోవడాన్ని గమనించి, ఇంట్లో పని పనుషులను పిలవగా ఎంతకీ స్పందించకపోవడం, ఫోన్లు స్విఛాఫ్ కావడంతో పాటు వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్టుగా తెలుసుకొని పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 15బృందాలతో గాలించి యూపీలో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9తులాల బంగారం, రెండు విలువైన గడియారాలు, రూ.1.49 లక్షల నగదుతోపాటు మొత్తం రూ.7లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.