- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క వారంలో ఐదు ఐపీఓలు!
దిశ, వెబ్‌డెస్క్: ఈ వారంలో ఐదు కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఐపీఓకు రానున్నాయి. ఇందులో దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థతో పాటు, దేశీయ మార్కెట్ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఖున్‌వాలా పెట్టుబడులను కలిగిన సంస్థతో సహా ఐదు కంపెనీలున్నాయి. ఈ కంపెనీలు ఐపీఓ నిర్వహించడం ద్వారా సుమారు రూ. 3,764 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలల కాలంలో దేశీయంగా చిన్న కంపెనీల ఐపీఓలు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించడం ద్వారా మరింత పటిష్ఠంగా మారాలనేదే ఈ కంపెనీల లక్ష్యం. దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యువెలరీ 16న ఐపీఓకు రానుంది. 18న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 1,175 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ 17న ప్రారంభమై 19న ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 600 కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెట్టిన గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్ ఐపీఓ 17న మొదలై 19న ముగుస్తుంది. ఈ సంస్థ రూ. 583 కోట్లను ఐపీఓ ద్వారా నిధులను సమీకరించనుంది. లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ ఐపీఓ ద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ 15వ తేదీ నుంచి 17 వరకు కొనసాగుతుంది. ఇక, వాహనాల పరికరాల తయారీ సంస్థ క్రాఫ్ట్‌మన్ ఆటోమేషన్ లిమిటెడ్ ఈ నెల 15 నుంచి 17 వరకు ఐపీఓలో అందుబాటులో ఉంటుంది. ఈ సంస్థ రూ. 150 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది.