కీలకరేట్లలో మరోసారి కోత ఉండొచ్చు!

by Harish |
కీలకరేట్లలో మరోసారి కోత ఉండొచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొవిడ్-19 వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు రివర్స్ రెపో రేటును తగ్గించింది. ఈ నెల 17న నగదు లభ్యత పెంచడం కోసం రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, 2021 మార్చికి ఆర్‌బీఐ కీలకరేట్లలో మరో 75 బేసిస్ పాయింట్లు కోత విధించే అవకాశముందని ఫిచ్ సొల్యూషన్ అంచనా వేసింది. ఇప్పటివరకు ప్రకటించిన కీలక రేట్ల తగ్గింపులు సరిపోవని అభిప్రాయపడింది. వచ్చే ఏడాదికి రెపో రేటును 3.65 శాతంగా 75 బేసిస్ పాయింట్లు తగ్గించి, రివర్స్ రెపో రేటును 3 శాతంగా మార్చవచ్చని తెలిపింది. గత వారం తగ్గించిన రివర్స్ రెపో రేటుతో ప్రస్తుతం 3.75 శాతం చేసింది. రెపో రేటులో కోత ఇవ్వలేదు. ప్రస్తుతం 4.40 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే కీలకమైన రేట్లను తగ్గించడం సులభమవుతుందని పేర్కొంది. ఇటీవల ఆర్‌బీఐ మాట్లాడుతూ..ఎన్‌బీఎఫ్‌సీలు, చిన్న మధ్య తరహా కంపెనీలు, ఎమ్ఎఫ్ఐలపై కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉంది. రానున్న రొజుల్లో రుణాలకు డిమాండ్ తగ్గొచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడా కంపెనీలు మూల ధన వ్యయాలను తగ్గించుకోవచ్చని అభిప్రాయపడింది.

Tags : Fitch Solutions, India, Interest Rates, RBI

Advertisement

Next Story

Most Viewed