జీడీపీ వృద్ధి ఔట్‌లుక్‌ను తగ్గించిన ఫిచ్ రేటింగ్స్!

by Harish |
జీడీపీ వృద్ధి ఔట్‌లుక్‌ను తగ్గించిన ఫిచ్ రేటింగ్స్!
X

దేశీయంగా బలహీనపడిన డిమాండ్‌తో పాటు, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ ఇండియా జీడీపీ వృద్ధిని తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి ఔట్‌లుక్‌ను 4.9 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. సప్లై చైన్‌కు అంతరాయం ఉండొచ్చనే అంచనాలతో తగ్గించినట్టు సంస్థ వివరించింది. రానున్న ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా ఉండే అవకాశముందని చెప్పింది.

స్థూల స్థిర మూలధన నిర్మాణంలో కలిగే సంకోచం, కేంద్రప్రభుత్వ వినియోగం మందగించడం, రెండో త్రైమాసికంలో ఎగుమతులు తగ్గిపోవడంతో జీడీపీ 4.7 శాతానికి తగ్గింది. కరోనా వైరస్ వల్ల చైనాలోని ఎలక్ట్రానిక్స్ సరఫర, ఆటోమోటివ్‌లలో అంతరాయం వచ్చింది. దీని ప్రభావం ఇండియా ఎగుమతుల ఉత్పాదక రంగంపై ఒట్టిడి పెంచింది. ఈ కారణాలను చూసే జీడీపీ ఔట్‌లుక్‌ను తగ్గిస్తున్నట్టు ఫిచ్ సంస్థ తెలిపింది.

tags : India GDP Growth, Fitch Cuts India GDP Growth, Coronavirus Impact, India’s Export From China, Covid-19 Outbreak In China

Advertisement

Next Story

Most Viewed