మూసీ నదికి వెళ్లిన జాలరి ఏమయ్యాడు.. ఆందోళనలో కుటుంబీకులు

by Sumithra |
మూసీ నదికి వెళ్లిన జాలరి ఏమయ్యాడు.. ఆందోళనలో కుటుంబీకులు
X

దిశ, నకిరేకల్: మూసీ నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన జాలరి గల్లంతు అయ్యాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండల పరిధి అమ్మనబోలులో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన సౌల శేఖర్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మూసీ నదిలో చేపల వేటకు వెళ్ళాడు. రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. నది వద్దకు వెళ్లి వెతికినా ఆచూకీ తెలియలేదు. గురువారం కూడా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. నదిలో ప్రవాహం ఎక్కువ కావడంతో కొట్టుకుపోయి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చొరవ తీసుకుని ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story