ఆ ఊరి జనాభా 28 మాత్రమే.. ఇప్పుడు 29!

by Shyam |
ఆ ఊరి జనాభా 28 మాత్రమే.. ఇప్పుడు 29!
X

ఇటలీలో మోర్టెరోన్ అనే ఒక గ్రామం ఉంది. పర్వతాల మధ్య ఉన్న ఆ గ్రామంలో లాంబార్డీ అనే తెగకు చెందినవారు జీవిస్తూ ఉంటారు. తెగ అనగానే 300, 400ల మంది ఉంటారని అనుకోవద్దు. ఆ తెగ జనాభా మొన్నటి వరకు 28 మంది మాత్రమే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు 29కి చేరుకుంది. ఆ బిడ్డకు ‘డెనిస్’ అని పేరు పెట్టారు. ఇది తెగ మొత్తం సంబరాలు చేసుకోవాల్సిన తరుణమని మోర్టెరోన్ మేయర్ ఆంటోనెల్లా ఇన్విర్‌నిజ్జీ అన్నారు. డెనిస్ తల్లిదండ్రులు మాట్టియో, సారాలను ఆయన దగ్గరుండి అభినందించారు.

వారి తెగ సంప్రదాయం ప్రకారం నీలి రంగు రిబ్బన్‌ను కట్టి మాట్టియో, సారాలు బాబు పేరును ప్రకటించారు. చివరగా 2012లో ఈ గ్రామంలో ఆడబిడ్డ పుట్టింది. ఆడపిల్ల పుడితే గులాబీ రంగు రిబ్బన్‌తో పేరును ప్రకటిస్తారు. ఇటీవల కరోనా వైరస్‌ కూడా ఈ తెగను పీడించింది. ఆ సమయంలో ఎంతమంది చనిపోతారోనని వారు కంగారు పడ్డారు. దురదృష్టవశాత్తు ఎవరికీ ఏం అవలేదు. పైగా ఈ పాండమిక్ సమయంలోనే ఇలా తమ జనాభా పెరగడం, బిడ్డ ఆరోగ్యంగా ఉండి 2.6 కేజీల బరువుతో పుట్టడం వారికి సంతోషం కలిగించింది. నిజానికి ఒక నెల క్రితం వరకు ఆ గ్రామ జనాభా 29 ఉండేది. కానీ ఇటీవల మేయర్ తండ్రి చనిపోవడంతో 28కి పడిపోయింది. ఇప్పుడు డెనిస్ పుట్టి ఆ లెక్కను సమం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed