- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. షికాగోలో మరో హైదరాబాద్ వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డారు. డిసెంబర్ 4న పాతబస్తీ చంచల్‌గూడకు చెందిన సయ్యద్ సిరాజ్ మెహదీ అనే 30 ఏళ్ల యువకుడిపై కాల్పుల ఘటన మరువక ముందే మరోసారి హైదరాబాద్ వ్యక్తిపై కాల్పులు జరిపారు. షికాగోలోని ఎస్ మిచిగాన్ ఎవెన్యూ సమీపంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ ముజుబుద్దీన్‌పై దోపిడీ దొంగలు కాల్పులు జరిపి పరారయ్యారు. కారులో వస్తున్న ముజుబుద్దీన్‌ను ఆపిన నల్లజాతీయులు.. పర్సు, నగదు లాక్కున్నారు. కారు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా ముజుబుద్దీన్ ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ముజుబుద్దీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story