చరిత్రాత్మక కంపెనీలో మంటలు.. నగరాన్ని కమ్మేసిన పొగమబ్బు

by vinod kumar |   ( Updated:2021-04-12 22:58:12.0  )
చరిత్రాత్మక కంపెనీలో మంటలు.. నగరాన్ని కమ్మేసిన పొగమబ్బు
X

మాస్కో : రష్యాలో రెండవ అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ కు వన్నె తెచ్చిన ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ నెవస్కయ మ్యానుఫ్యక్చురలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. నెవా నది ఒడ్డున ఉన్న నెవస్కయ మ్యానుఫ్యక్చుర (Nevskaya Manufaktura) లో సోమవారం స్థానిక సమయం రాత్రి 9.30 గంటల సమయంలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు అంతస్తులలో ఉన్న ఈ బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించినట్టు సమాచారం. దీంతో నగరమంతా పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో నలభై మంది దాకా ఉన్నట్టు తెలుస్తున్నది. వారంతా కాలిన గాయాలతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒకరు మరణించారు. మంటలార్పడానికి 350 మంది అగ్ని మాపక సిబ్బంది పోరాడుతున్నారు.

ఘన చరిత్ర : వస్త్ర తయారీ సంస్థగా పేరున్న నెవస్కయకు ఘన చరిత్ర ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ బ్రాండ్ తో ఫ్యాబ్రిక్ వస్త్రాలను తయారుచేస్తున్న ఈ సంస్థను 1841లో ఏర్పాటు చేశారు. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ జార్జ్ త్రోంటన్ అండ్ సన్స్ దీని వ్యవస్థాపక సభ్యులు. సోవియట్ యూనియన్ రష్యాను పాలించిన కాలంలో దీనిని ప్రభుత్వరంగ సంస్థగా మార్చారు. అనంతరం 1992 లో దీనిని ప్రయివేటు వాళ్లకు అప్పగించారు. 2001 లో ఈ బిల్డింగ్ ను సెయింట్ పీటర్స్‌బర్గ్ సాంస్కృతిక, వారసత్వ సంపదగా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed