- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్నిప్రమాదం.. 900 క్వింటాళ్ల పత్తి దగ్ధం
దిశ, మెదక్: నారాయణఖేడ్ మండలం రుద్రారం వద్ద పత్తి కొనుగోలు కేంద్రంలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు 900 క్వింటాళ్ల పత్తి దగ్ధం అయినట్టు కాటన్ కార్పొరేషన్ ఇన్‌చార్జి హర్షల్ డహాకే తెలిపారు. శుక్రవారం నారాయణఖేడ్ సహాయ వ్యవసాయ సంచాలకులు కరుణాకర్ రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రం ఇంచార్జ్‌ను వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి మాట్లాడుతూ.. ఎప్పటిలాగే రైతుల నుంచి సేకరించిన పత్తిని ఒకచోట చేర్చి అనంతరం దానిని డోజర్ వాహనంతో యంత్రంలో వేసేందుకు ప్రయత్నించగా.. నేలపై తాకడంతో ఇనుముకు, కంకరకు మధ్య రాపిడి జరిగి నిప్పురవ్వలు రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అన్నారు. మంటలు ఆర్పేందుకు ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్న నీటితో సాయంతో, అనంతరం అగ్నిమాపక వాహనం సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. సుమారు 3 వేల క్వింటాళ్ల పత్తి కేంద్రంలో నిల్వవుండగా సుమారు తొమ్మిది వందల క్వింటాళ్ల పత్తి పాక్షికంగా దగ్ధం మయ్యిందని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన పత్తికి ప్రభుత్వం, శాఖ పూర్తి బాధ్యత వహిస్తుందని అన్నారు.