- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిపురుష్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ, చిత్ర యూనిట్‌కు ఊహించని స్థాయిలో లాంచింగ్ రోజే అపశృతి జరిగింది. ముంబైలోని గోరెగావ్ స్టూడియోలోని తొలి రోజు షూటింగ్ జరుగుతున్న సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో డైరెక్టర్ ఓం రావుత్ సెట్‌లో ఉండగా.. ప్రభాస్, సైఫ్ అలీఖాన్‌లు లేరని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Advertisement
Next Story