నాచారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఇదే ప్రాంతంలో ఉన్న ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఒక్క సారిగా వ్యాపించాయి. ప్రమాదం జరిగింది రబ్బర్‌ ఫ్యాక్టరీ కావడంతో మంటల తీవ్రంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో తీవ్రంగా శ్రమిస్తూ మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.

Advertisement