ఘోర అగ్నిప్రమాదం..పేదోని పూరి గుడిసె దగ్ధం

by Sridhar Babu |
ఘోర అగ్నిప్రమాదం..పేదోని పూరి గుడిసె దగ్ధం
X

దిశ, చర్ల : పూరి గుడిసె మంటల్లో దగ్దం అయిన ఘటన చర్ల మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నాగేంద్రకు చెందిన పూరి గుడిసెలో ఎవరు లేని సమయంలో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేశారు. గడ్డితో వేసుకున్న పూరి గుడిసె కావడంతో ఇళ్లు పూర్తిగా దగ్ధం అయింది.

ఈ అగ్ని ప్రమాదంలో భారీగా‌నే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద బాధిత, నిరుపేద దళిత కుటుంబాన్ని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని గ్రామ యువకులు సిద్ధి‌ రాజు, గంపల రమేష్, కొంగూరు సోమరాజు, కొంబత్తిని రాము, టీఆర్ఎస్ పార్టీ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు తోటమల్ల వరప్రసాద్ తదితరులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed