తహశీల్దార్ కార్యాలయంలో మంటలు.. బూడిదైన కీలక ఫైళ్లు

by Sumithra |   ( Updated:2021-10-25 06:40:50.0  )
తహశీల్దార్ కార్యాలయంలో మంటలు.. బూడిదైన కీలక ఫైళ్లు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. రోజువారీ మాదిరిగానే సిబ్బంది ఉదయానికి కార్యాలయానికి చేరుకుని తాళాలు తీయగా కార్యాలయం మొత్తం మంటలు, పొగలతో ఉండడాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే కార్యాలయంలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్ కాలి బూడిద అయ్యాయి.

కాగా, ఈ ఘటన పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల రేట్లు పెరగడం, రికార్డులలో అనేక అవకతవకలు జరగడం వంటి కారణాల వల్ల కావాలనే నిప్పంటించి ఉంటారని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుండగా. కార్యాలయ సిబ్బంది మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉన్నత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story