కేసీఆర్ ఇలాకాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

by Shyam |
Gajwel
X

దిశ, గజ్వేల్ : గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలో ఉన్న థర్మోకోల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాములపర్తి శివారులోని లక్ష్మీ ఈపీఈ ఫోమ్ షీట్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పరిశ్రమ డైరెక్టర్ లక్ష్మణ్ రావు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాములపర్తి శివారులో పరుపుల తయారీలో ఉపయోగించే ఫోమ్ షీట్స్(థర్మోకోల్ షీట్స్) తయారవుతున్నాయి.

ఈ క్రమంలో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. మంటల కారణంగా పరిశ్రమలోని షెడ్డు, యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు రూ. 7కోట్ల విలువ చేసే ‘రా’ మెటీరియల్ కాలిపోయినట్టు కంపెనీ డైరెక్టర్ లక్ష్మణ్ రావు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని ఎస్ఐ శ్రీశైలం వెల్లడించారు.

Gajwel

Advertisement

Next Story

Most Viewed