రాగులతో రోగాలు దూరం

by sudharani |   ( Updated:2021-06-23 08:19:58.0  )
రాగులతో రోగాలు దూరం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే రాగులలో మనకు తెలియని ఎన్నో పోషకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచేందుకు అవి చాలా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో రాగులని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలనీ, తద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

రాగులు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అలసిన శరీరానికి శక్తి లభిస్తుంది. డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్, గ్లైసిమియా షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలామంచిది. ఇన్సులిన్ నిల్వలు పెంచేందుకు ఇవి దోహదపడతాయి. రాగుల్లోని మినరల్స్, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తశాతం పెంచడం, రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడానికి తోడ్పడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. మెగ్నీషియం, పొటాషియం నిల్వలు గుండెసంబంధిత సమస్యలు తగ్గించడంలో ముందుంటాయి. అమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి బరువుని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా మారతాయి. కీళ్ల నొప్పులు ఉండవు. ఎదిగే పిల్లలకి ఇది చక్కని బలవర్ధక ఆహారమని చెప్పొచ్చు. ఎముకల పుష్టి కోసం తీసుకునే క్యాల్షియం మాత్రలకు బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మంచిది. వీటిలో అత్యధిక స్థాయిలో ఉండే పాలిఫెనాల్, ఫైబర్, బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో ఉంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌కు ఇది మంచి మందు. రాగుల్లో సహజసిద్ధమైన ఇనుము ఉంటుంది. అనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ సీ స్థాయిని ఇది పెంచుతుంది.

Tags: finger millet, healthy food, minerals, vitamins, summer

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు

Advertisement

Next Story