మాస్కులు ధరించని వారికి జరిమానాలు

by Shyam |
మాస్కులు ధరించని వారికి జరిమానాలు
X

దిశ, నిజామాబాద్: మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నవారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో తహసీల్దార్ వెంకటరావు, ఎస్సై కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డిలు కలిసి మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించకుండా, భౌతికదూరం మరిచి తిరుగుతున్న 84 మందిని గుర్తించి వారికి జరిమానాలు విధించారు. అనంతరం వారు మాట్లాడుతూ కిరాణా షాపులు, చికెన్, మటన్, పండ్ల దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని సూచించారు. అనసవసరంగా ద్విచక్ర వాహనాలపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు.

Tags:Nizamabad,bichkunda,Masks,fine

Advertisement

Next Story