- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్స్‌ఫర్డ్ టీకాపై ఆశలు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనే టీకాపై విశ్వవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 140 టీకాలు పలుదేశాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో కనీసం 13 రకాల టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇందులోనూ ముందంజలో ఉన్న టీకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా డెవలప్ చేసిన టీకా, మాడ్రనా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు మెరుగైన దశలో ఉన్నాయని పేర్కొంది. ఇందులోనూ ఆక్స్‌ఫర్డ్ టీకా ఇంకాస్త ఉన్నత దశలో ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం ఆ టీకా ఉన్న పరిశోధక దశ ప్రాతిపదికగా ఈ అంచనా వేసినట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వివరించారు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, క్లినికల్ ట్రయల్స్ దశల ప్రకారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రా జెనెకాల టీకానే ముందంజలో ఉన్నదని అన్నారు. అయితే, జులైలో మాడ్రనా టీకాపైనా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారని, అంటే ఆక్స్‌ఫర్డ్ టీకా పురోగతికి చాలా దగ్గరలోనే మాడ్రనా టీకా ఉన్నదని చెప్పారు.
ఏడాదిపాటు అండ
ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రా జెనెకాలు డెవలప్ చేసిన ఏజెడ్‌డీ 1222 వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న ఈ వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సరఫరా, తయారీకోసం పదో సంస్థతో ఒప్పందం కుదిరింది. బ్రెజిల్‌లో స్థానికంగా ఈ టీకాను తయారు చేయడానికి 127 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది జనవరిలోపు 3 కోట్ల డోస్‌ల టీకాలను తయారు చేయనున్నట్టు బ్రెజిల్ ఆరోగ్యాధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ముందుగా తీవ్రంగా బాధపడుతున్న కరోనా పేషెంట్లు, వయోధికులు, ఆరోగ్య, రక్షణ సిబ్బందికి అందిచనున్నారు. ఈ టీకా కరోనా నుంచి ఏడాదిపాటు కాపాడుతుందని ఆస్ట్రాజెనెకా సీఈవో ఇటీవలే వెల్లడించారు.
రెండో దశ ట్రయల్స్‌లో మాడ్రనా టీకా
అమెరికాకు చెందిన మాడ్రనా సంస్థ తన టీకా ఎంఆర్ఎన్ఏ-1273పై రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. కాటలెంట్ భాగస్వామితో కలిసి సెప్టెంబర్‌కల్లా కోటి డోసుల వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు భీష్మించుకుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చేనెలలో 30వేల మందితో చివరిదశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని మాడ్రనా సంస్థ సీఈవో స్టెఫానీ బాన్సెల్ తెలిపారు. ఈ ట్రయల్స్ కోసం భాగస్వామి కాటలెంట్ సహకరించనుంది. కాటలెంట్ కేవలం మాడ్రనాతోనే కాదు, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రా జెనెకాతోనూ డీల్స్ కుదుర్చుకుంది.
ఆ రేసులో మాకు పోటీ లేదు: సనోఫి
ఫ్రెంచ్ ఫార్మస్యూటికల్ సంస్థ సనోఫి, జీఎస్‌కేతో కలిసి కరోనాకు టీకాను అభివృద్ధి చేసింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌లో ఈ టీకాపై తొలి క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించాల్సి ఉన్నది. తమ దగ్గర ఒకటికి మించి టీకాలున్నాయని, ఈ ఏడాది చివరిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. ఇప్పటికే విజయవంతమైన జీఎస్‌కేకు చెందిన ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ఈ టీకాలో వాడుతున్నామని, ఈ రేసులో తాము ఒక్కరమే ఉన్నామని వివరించింది.
థాయ్‌లాండ్‌లో ఏడు టీకాలు
అనేక పద్ధతులనుపయోగించి అభివృద్ధి చేస్తున్న ఏడు టీకాలు థాయ్‌లాండ్‌లో ఉన్నాయి. ఇందులో అక్టోబర్‌లోపే ఒక టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. చులలాంగ్‌కోర్న్ వర్సిటీకి చెందిన పరిశోధకుడు కియట్ రుక్స్‌రుంగ్తమ్ మాట్లాడుతూ, టీకా తొలి ఇంజెక్షన్‌ను కోతులకు ఇవ్వగా వాటిదేశాల్లో యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్టు తేలిందని వివరించారు. మెజార్టీగా యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేసే ప్రక్రియ కనిపించిందని తెలిపారు. వైరస్ ఒక కణంలోకి చేరి దాన్ని ధ్వంసం చేయకుండా నిరోధించే ప్రక్రియ అభివృద్ధి చెందిందని చెప్పారు. వచ్చే రెండువారాల్లో జంతువులపై పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలు వస్తాయని, సాన్ డియెగో, వాంకోవర్‌లలో 10వేల టీకాలను ఉత్పత్తి చేసి మనుషులపై ట్రయల్స్ కోసం థాయ్‌లాండ్ తరలించడమే తరువాయి అని చెప్పుకొచ్చారు.
టీకా రేసులో చైనా
చైనా కూడా వ్యాక్సిన్ రేసులో పోటీపడుతున్నది. చైనా నేషనల్ బయోటెక్(సీఎన్‌బీజీ) అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్‌లు మెరుగైన ప్రదర్శనలు కనబరిచాయని సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చైనా ప్రభుత్వ సంస్థ చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్‌తో అనుబంధంగా ఉన్న ఈ సీఎన్‌బీజీ నిర్వహించిన హ్యూమన్ ట్రయల్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తూ సేఫ్‌గా ఉన్నట్టు తేలిందని ఆ సంస్థ వివరించింది. కాగా, రెండో వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలనిచ్చిందని పేర్కొంది. 1,120 మందిపై చేసిన ట్రయల్స్‌లో టీకాను ప్రయోగించిందని తెలిపింది. అందరిలోనూ హైలెవల్ యాంటీబాడీలను ప్రేరేపించిందని వెల్లడించింది. ఈ దేశంలో మొత్తం ఎనిమిది టీకాలను అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయి.