- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 ఏళ్ల వయస్సులో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధం.. ఒక శక్తిమంతమైన సాధనం..డబ్బు. ఎప్పుడు ఎవరి చేతిలోకి మారుతుందో ఎవ్వరం చెప్పలేము. ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడితే.. చివరిదశలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అందుకే ఒక ఆర్ధిక ప్రణాళిక అనేది ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆ.. ఇపుడెందుకు మన వయస్సు ముప్పై యే కదా.. ఆర్థిక ప్రణాళిక ల గురించి 50లో ఆలోచిద్దాం.. 60లో చూసుకొందాం అంటే పొరబడినట్లే.. ఈ 30 ఏళ్ల వయస్సులో ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచించకపోతే మీ జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఇదే అవుతుంది. మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి అంటుంటారు పెద్దలు. అలాగే కాలానికి అనుగుణంగా మారి ఒక ప్రణాళికతో ముందుకు వెళితే జీవితం చివరిదశలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సాఫీగా సాగిపోతోంది. అందుకు కావల్సినది ఒకటే ఒక్కటి ఈ ముప్ఫైయేళ్ల వయస్సులో సరైన ప్లానింగ్.. మరి ఆ ప్లానింగ్ ఎలా చేయాలి.. ఏం చేయాలి అనేది చూద్దాం.
వయస్సు 30 ఏళ్లకు చేరిందంటే మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. ఈ వయసులో అసలైన బాధ్యతలు భుజాలపైకి వస్తాయి. దీంతో ఎక్కువ బరువు మోస్తున్న ఫీలింగ్ వస్తోంది. దీనివలన డిప్రెషన్ కి గురి అవుతూ.. సమస్యలను ఎదుర్కోలేక తడబడిపోతుంటారు. అలా కాకుండా ఒక సరైన ప్రణాళికను సెట్ చేసుకోవాలి. ఈ వయస్సు వచ్చేసరికి పొదుపు చేయడం మొదలు పెట్టాలి. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం, కొంత డబ్బును సేవ్ చేయడం ఈ వయస్సు నుంచే స్టార్ట్ చేయాలి. వాటికి కూడా ఒక గమ్యం అనేది ఉండాలి. ఆ డబ్బుతో ఇల్లు కొనాలి, కారు కొనాలి, వ్యాపారం మొదలుపెట్టాలి అనే లక్ష్యం పెట్టుకొంటే వాటిని సాధించడం ఈజీ అవుతోంది.
ఇక ఒక ఉద్యోగం చేస్తున్నాం లేదా వ్యాపారం చేస్తున్నాం అంటే వాటికి ఏదో ఒకరోజు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం రాకతప్పదు. 60 ఏళ్లకు రిటైర్‌మెంట్ ఉంటుంది కదా అప్పుడు చూడొచ్చు అనుకోకూడదు. ఇప్పటినుంచే దానికోసం కూడా ఒక పక్కా ప్లాన్ రెడీ చేసుకోవాలి. బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇన్వెస్ట్ చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి తక్కువ బాధ్యతలు ఉన్నప్పుడే ఎంతో కొంత రిటైర్‌మెంట్ తర్వాత జీవితం కోసం పక్కన పెట్టడం ప్రారంభించాలి. మంచి రిటర్న్స్ ఇచ్చే పథకాల్లో మదుపు చేయాలి. 30లోకి చేరుకునేటప్పటికీ ఖర్చులు పెరిగిపోతాయి. పెళ్లి, పిల్లలు స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులు ఇలా చాలా ఉంటాయి. కాబట్టి అత్యవసర పరిస్థితులకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మీ ఉద్యోగం లేదా బిజినెస్‌లో ఏమైనా సమస్యలు తలెత్తినా.. తప్పనిసరి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవాలి.
ఇక వీటితో పాటు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఈ వయస్సులోనే తలత్తే ఆరోగ్య సమస్యలను పట్టించుకోవాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లాంటివి స్టార్ చేయాలి. మీతో పాటు కుటుంబంలో ఉన్నవారికి కూడా అవి వర్తించేలా చూడాలి. ఎందుకంటే బాధ్యతలు తీసుకొన్నాకా ప్రతి కుటుంబం వారిమీదే ఆధారపడుతోంది. ఈ సమయంలో వారు నిర్లక్ష్యం వహిస్తే ఆ ప్రభావం కుటుంబం మీద పడుతోంది. దానికి కారకులు కూడా మీరే అవుతారు. కుటుంబం మొత్తానికీ బీమా ఉండడం మరింత ఉత్తమం. ఒకవేళ ఆరోగ్యపరంగా ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడినా.. బీమా ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. 30 ఏళ్ల వయస్సులో నువ్వెలా ఉంన్నావు అనేది అన్నింటికన్నా ముఖ్యం.. చెడు స్నేహాలు, మత్తు పదార్ధాలు, వ్యసనాలు , క్రెడిడ్ కార్డ్స్ , లోన్లు వీటికి అలవాటుపడి డబ్బును వృథాగా ఖర్చుపెడితే.. రేపటి రోజు ఖచ్చితంగా తిప్పలు తప్పవు. వీటిని కనుక మీరు చేస్తుంటే ఇప్పటికైనా ఈ తప్పులను సరిచేసే ప్రయత్నం చేయండి.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. వృద్ధాప్యంలో కూడా ఇలాగే కష్టపడాల్సి వస్తోంది. 30 ఏళ్ల వయస్సులో మీరు చేసే ఆర్థిక ప్రణాళిక 60 ఏళ్ల వయస్సులో మీ జీవితాన్ని నిర్దేశిస్తోంది.