- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డెంగ్యూ మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం..
by Sridhar Babu |

X
దిశ, మణుగూరు : మల్లారం గ్రామపంచాయతీ పరిధిలో చినరాజుపేట గ్రామంలో గతవారం క్రితం ఇర్ప వినోద్ డెంగ్యూ జ్వరంతో మరణించిన విషయం విదితమే. ఇర్ప వినోద్‌ను కోల్పోయిన భార్య అనిత, పిల్లలు దిక్కులేని వారిగా మిగిలిపోయారు. ప్రస్తుతం రెక్కాడితే డొక్కాడని పరిస్థితి కుటుంబానిది. బాధిత కుటుంబీకుల జీవనం కఠినంగా సాగుతున్న విషయాన్ని ట్రాక్టర్ల డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి సతీష్ తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం యూనియన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి సతీష్ ఆధ్వర్యంలో డ్రైవర్లు, ఓనర్లు కలిసి ఇర్పవినోద్ కుటుంబానికి రూ.35,000 /- రూపాయలను ఆర్థిక సహాయం అందించారు.
Next Story