ఆ వరల్డ్ కప్‌కు వేదికలు సిద్ధం

by  |
ఆ వరల్డ్ కప్‌కు వేదికలు సిద్ధం
X

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2023ను ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 32 దేశాలు పాల్గొనే ఈ వరల్డ్ కప్ తొలి సారిగా రెండు దేశాలు నిర్వహించనుండటం గమనార్హం. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లోని 9 ప్రధాన నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఓపెనింగ్ మ్యాచ్ ఆక్లాండ్‌లో, ఫైనల్ మ్యాచ్ సిడ్నీలోని స్టేడియం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈ ఏడాది చివర్లో ప్రకటిస్తామని, ప్రస్తుతానికి వేదికలను ఖరారు చేసినట్లు బుధవారం జ్యూరిచ్‌లో ఫిఫా వెల్లడించింది.

ఇవే వేదికలు

హిండ్‌మార్ష్ స్టేడియం – అడిలైడ్
తమాకి మకారో ఈడెన్ పార్క్ – ఆక్లాండ్
బ్రస్బేన్ స్టేడియం – బ్రిస్బేన్
ఓటిపొటి డునేదిన్ స్టేడియం – డునేదిన్
కిరికిరియ్యో వాయ్‌కాటో స్టేడియం – హామిల్టన్
మెల్‌బోర్న్ రెక్టాంగ్యులర్ స్టేడియం – మెల్‌బోర్న్
పెర్త్ రెక్టాంగ్యులర్ స్టేడియం – పెర్త్
స్టేడియం ఆస్ట్రేలియా – సిడ్నీ
సిడ్నీ ఫుట్‌బాల్ స్టేడియం – సిడ్నీ
వెల్లింగ్టన్ స్టేడియం – వెల్లింగ్టన్

Advertisement

Next Story