- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆరే మా టార్గెట్.. మేము గెలవకపోయినా ఓట్లు చీల్చుతాం
దిశ, ఆందోల్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేందుకు ఫీల్డ్ అసిస్టెంట్‌లు సిద్ధమయ్యారు. ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో నియోజకవర్గం నుంచి 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లు పోటీ చేసేందుకు అవసరమైన పత్రాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం జోగిపేటలోని ఆర్‌డీవో కార్యాలయం నుంచి నామినేషన్ డిక్లరేషన్ పత్రాలను ఆందోలు మండలానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు సత్యనారాయణ, అనిల్ కుమార్, బుచ్చయ్య, సత్యనారాయణలు పొందారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నాయకుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వారు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించి తమ ఐక్యతను చాటుతామన్నారు. హుజరాబాద్‌లో జరగబోయే ఉపఎన్నికల్లో పోటీ చేయడం సంతోషదాయకమన్నారు.కానీ, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేకపోవడం బాధాకరమన్నారు. చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో మేము సైతం పోటీకి దిగి గెలుపు వరించకపోయినా ఓట్లు చీల్చడం మాత్రం ఖాయమన్నారు. నామినేషన్ వేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తామని తెలిపారు.