ఎంఎస్ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీ సమస్యలను పరిష్కరించాలన్న ఎఫ్ఐడీసీ

by Harish |
ఎంఎస్ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీ సమస్యలను పరిష్కరించాలన్న ఎఫ్ఐడీసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలు, ఈ సంస్థలకు రుణాలందించే ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆర్థిక పరిశ్రమ అభివృద్ధి మండలి(ఎఫ్ఐడీసీ) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖను కోరింది. ఎంఎస్ఎంఈగా నమోదు చేసుకోవడానికి అనుమతించిన కార్యకలాపాల జాబితాలో టోకు, రిటైల్ వాణిజ్యాన్ని కూడా చేర్చాలని ఎఫ్ఐడీసీ తన లేఖలో అభ్యర్థించింది. దేశ ఆర్థికవ్యవస్థకు గణనీయంగా దోహదపడే, వ్యాపార రంగంలో అంతర్భాగమైన రిటైల్, టోకు వ్యాపారులు ఎంఎస్ఎంఈల నుంచి మినహాయించబడుతున్నారని తెలిపింది.

దేశంలోని మొత్తం ఎంఎస్ఎంఈలలో ఈ వ్యాపారులు 35 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ వీరు బ్యాంకుల నుంచి ద్రవ్య మద్దతును, అవసరమైన స్థాయిలో విస్తరణకు తగిన ప్రయోజనాలను పొందలేకపోతున్నారని ఎఫ్ఐడీసీ వివరించింది. అలాగే, వడ్డీ సబ్‌వెన్షన్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, ఎంఎస్ఎంఈ, రిటైల్, టోకు వ్యాపారులకు దీన్ని విస్తరించాలని అభ్యర్థిస్తున్నట్టు ఎఫ్ఐడీసీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed