- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి
దిశ, కరీంనగర్: రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీలో సెప్టెంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మాణంలో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ రంగానికి రామగుండం ఎరువుల కర్మాగారం వరం లాంటిదన్నారు. ప్లాంటులో ఎరువుల ఉత్పత్తి, విధానం, రవాణా తదితర పనులను పరిశీలించారు. ప్లాంటు నిర్మాణం 99 శాతం పూర్తయిందని, సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏటా12.5 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తిలో 50 శాతం ఎరువులు తెలంగాణకే కేటాయిస్తామని పేర్కొన్నారు. టెక్నికల్ ఉద్యోగాలు మినహా మిగిలిన ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేలా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ సిక్త్ పట్నాయక్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.