- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వైన్ బాటిల్ ధర అక్షరాలా 7.38 కోట్లు.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒక వైన్ బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది.. మనకు తెలిసినంత వరకైతే ఓ వెయ్యో, రెండు వేలో ఉంటుంది. ఇంకా ఖరీదైన వైన్ బాటిల్ కొనాలంటే ఓ పది వేలు.. కానీ ఒక ఫ్రెంచ్ వైన్ బాటిల్ విలువ అక్షరాలా 7.38 కోట్ల రూపాయలు. అమ్మో .. ఒక్క వైన్ బాటిల్ అంతా ఖరీదా ? ఎందుకు దానికంత రేటు… అని అంటే అది భూమి మీద పులియబెట్టింది కాదు కాబట్టి. అవునండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడాదికి పైగా ఉండి ఇటీవలే భూమి మీదకు వచ్చిన ఓ ఫ్రెంచ్ వైన్ ను వేలం వేయడానికి సిద్ధపడ్డారు శాస్త్రవేత్తలు. ‘ది పెట్రస్ 2000’ అనే ఈ వైన్ బాటిల్‌ను అమ్మకానికి పెడుతున్నట్టు నిర్వాహక సంస్థ క్రిస్టీస్ వైన్ అండ్ స్పిరిట్ డిపార్ట్‌మెంట్స్ తెలిపింది. ఈ బాటిల్‌కు రూ. 7.38 కోట్ల ధర పలకవచ్చని అంచనా వేస్తుంది.
2019 నవంబర్‌లో స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్ అనే సంస్థ పంపిన 19 వైన్ బాటిల్స్ లో ఇది ఒకటి. భూమికి వెలుపల వ్యవసాయం చేసే అవకాశాలపై పరిశోధన చేసేందుకు వీటిని స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్ అనే సంస్థ అంతరిక్షానికి పంపింది. అయితే దీని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. భూమి మీద ఉన్న వైన్ కంటే ఈ వైన్ రుచి, సువాసన చాలా బావున్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మరీ ప్రపంచంలోనే అరుదైన ఈ వైన్ ని అంత డబ్బు పెట్టి ఎవరు సొంతంచేసుకుంటారో చూడాలి.