- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడు చేస్తే కఠిన చర్యలు
X
దిశ, ఏటూరునాగారం:
అటవీ భూములు ఆక్రమించి పోడు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఓ వీణావాణి హెచ్చరించారు. గురువారం అటవీశాఖ ఏటూరునాగారం డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భూములుసాగు చేసుకునే వారి వివరాలు అటవీశాఖ వద్ద సాటిలైట్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్రమంగా పోడు వ్యవసాయం చేస్తూ అడవులు నరికినా ఆక్రమించడానికి ప్రయత్నించినా, సాగులో ఉన్నాయని ప్రచారం చేసిన చెల్లవన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. సాటిలైట్ చిత్రాలు బేస్ చేసుకొని ఎవరైతే పోడు చేస్తున్నారో వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిపారు. అక్రమంగా పోడు చేసుకుంటున్న వారిపైన తెలంగాణ అటవీశాఖ చట్టంతో పాటు వన్యప్రాణి 1972 చట్టం ప్రకారం ఏడేండ్ల పాటు జైలుశిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు.
Advertisement
Next Story