నవ వధువైన కూతురుపై తండ్రి అత్యాచారయత్నం.. రాత్రి కాగానే..

by Sumithra |   ( Updated:2021-08-11 06:03:25.0  )
నవ వధువైన కూతురుపై తండ్రి అత్యాచారయత్నం.. రాత్రి కాగానే..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై రోజురోజుకు మృగాళ్ల అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామ కోరికలతో రగులుతూ వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో కన్నకూతురిపైనే అత్యచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. ల‌ఖీంపూర్ ఖేరి జిల్లాలోని మైగ‌ల్‌గంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి(40) భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి ఒక కుమార్తె(25). ఇటీవలే ఆమెకు వివాహం జరుగగా.. ఆషాఢ మాసం కావడంతో పుట్టింటికి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతనికి ఇంటిలో నిద్రిస్తున్న కుమార్తె కనిపించింది. తాగిన మైకంలో తండ్రి నిద్రిస్తున్న కూతురిని అభ్యంత‌ర‌క‌రంగా తాకి లైంగిక దాడికి ప్ర‌య‌త్నించాడు. కుమార్తె వారించడానికి ప్రయత్నించినా వినకుండా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తన తల్లి సాయంతో తండ్రి చేతుల నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా తన తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed