- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లవ్ స్టోరీ.. భార్య, బిడ్డపై కిరోసిన్ పోసిన తండ్రి
దిశ, వెబ్‌డెస్క్ : అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు వేరే కులానికి చెందిన వాడిని ప్రేమించింది. ఈ విషయం తెలియడంతో గత కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అతన్ని మర్చిపోవాలని తండ్రి పలుమార్లు కూతరుని హెచ్చరించాడు. అయినా, ఆమె ప్రవర్తనలో ఏలాంటి మార్పు లేదు. రోజులానే బుధవారం కూడా గొడవ జరగడంతో ఆగ్రహించిన తండ్రి భార్య, బిడ్డపై కిరోసిన్ పోశాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య తమకు తామే చనిపోతామంటూ అగ్గిపుల్ల గీసి నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరికి ఇద్దరూ మరణించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. జిల్లాలోని షాద్‌నగర్ పరిధిలోని మోగిలి గిద్ద గ్రామంలో పాండు కుటుంబం నివాసముంంటోంది. అతనికి భార్య చంద్రకళ, కుమార్తె స్రవంతి ఉన్నారు. కూతురు స్రవంతి అదే గ్రామానికి చెందిన రామదాసుతో ప్రేమలో ఉన్నది. అది కాస్త తల్లితండ్రులకు తెలియడంతో తండ్రి పలుమార్లు ఆమెను మందలించాడు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. తండ్రి పాండు బిడ్డపై, భార్యపై కిరోసిన్ పోశాడు. తల్లి వెంటనే తామే చనిపోతామంటూ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది. దీంతో శరీరమంతా మంటలు అంటుకున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రకళ, కూతురు స్రవంతిని చికిత్స కోసం షాద్‌నగర్ ప్రభుత్వ హోస్పటల్‌కు తరలించారు.
తన తండ్రే తమపై కిరోసిన్ పోశాడని కుమార్తె వెల్లడించింది. ప్రేమ విషయంలో తన కుమార్తె మాట వినకపోవడంతో ఇంట్లో తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోందని, ఇద్దరిలో ఎవరైనా చావాలంటూ భర్త ఇద్దరిపై కిరోసిన్ పోసినట్లు భార్య చంద్రకళ చెప్పింది. పోలీసులు బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. కూతురు స్రవంతి స్టేట్‌మెంట్ ప్రకారం తండ్రి పాండు, తల్లి చంద్రకళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇద్దరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.