ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై కేటీఆర్ ప్రశంస

by Ramesh Goud |
ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై కేటీఆర్ ప్రశంస
X

మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సత్వర న్యాయం అందించాయనీ, వాటిని మంత్రి కేటీఆర్ అభినందించారు. కేవలం 6 నెలల వ్యవధిలో కోర్టులు 3 తీవ్రమైన నేరాల్లో తీర్పులు వెలువరించాయనీ, ఐదుగురు నిందితులకూ ఉరిశిక్ష పడిందని తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు, హోం డిపార్ట్‌మెంట్ అధికారులకు శుభాభినందనలు అని కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story