- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బై బై.. ఫార్మ్‌విల్లే!
దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ ప్రారంభమైన కొత్తలో, యాప్ రాక ముందు బ్రౌజర్‌లో ఉపయోగించిన రోజులు గుర్తున్నాయా? అప్పట్లో ఫేస్‌బుక్‌లో ఇన్ని పేజీలు, ఇంత కంటెంట్, ఇన్ని పోస్టులు ఉండేవి కావు. ఫేస్‌బుక్ ఓపెన్ చేసి వెంటనే గేమ్స్ తెరిచే వారు. అందులో ఆడటానికి పదుల సంఖ్యలో మాత్రమే గేమ్స్ ఉండేవి. ఆ గేమ్స్‌లో ఫార్మ్‌విల్లేను ఎక్కువ మంది ఆడేవారు. అప్పట్లో ఫార్మ్‌విల్లే అంటే అదో క్రేజు. వ్యవసాయాన్ని వర్చువల్‌గా చేయించే ఈ గేమ్ అంటే పడిచచ్చేవారు. తర్వాత వేరే గేమ్‌లు వచ్చినా దీని క్రేజ్ తగ్గలేదు. చాలా మంది నగరవాసులు కోరుకునే జీవితం ఈ ఫార్మ్‌విల్లేలో దొరుకుతుండటంతో అందరూ చాలా ఆసక్తిగా ఆడేవారు. మరి ఇప్పుడు ఈ గేమ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం?
త్వరలో ఈ గేమ్‌ను ఆన్‌లైన్ నుంచి తొలగించబోతున్నారు. ఈ మేరకు ఫార్మ్‌విల్లే రూపకర్త కంపెనీ జైంగా సెప్టెంబర్ 26న ప్రకటించింది. డిసెంబర్ 31, 2020 నుంచి ఈ గేమ్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు కారణం అడోబ్ సంస్థ నిర్ణయమే. అన్ని వెబ్‌బ్రౌజర్లకు తమ ఫ్లాష్ ప్లేయర్ అప్‌డేట్‌లను ఇక నుంచి నిలిపివేయనున్నట్లు ఇటీవల అడోబ్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ప్లేయర్ ఆధారిత గేమ్‌లన్నింటినీ ఫేస్‌బుక్ నిలిపివేయనుంది. 2009లో ప్రారంభమైన ఈ ఫార్మ్‌విల్లే గేమ్ 11 ఏళ్ల పాటు అందరినీ ఆకట్టుకుంది. నవంబర్ 17 నుంచి ఇన్ యాప్ కొనుగోళ్లను నిలిపివేసి, డిసెంబర్ నాటికి గేమ్‌ను పూర్తిస్థాయిలో ఆపివేయనున్నారు. దీనికి నెలకు 83.76 మిలియన్ల యాక్టివ్ యూజర్లు, అత్యధికంగా ఒకరోజులో 34.5 మిలియన్ల మంది యూజర్లతో ఫార్మ్‌విల్లే రికార్డులు కూడా సృష్టించింది.