- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు మద్దతు ధర అందకుంటే రాజీనామా చేస్తా
చండీగఢ్: రైతులకు కనీస మద్దతు అందించడానికి తాను కట్టుబడి ఉంటానని హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతలా అన్నారు. వారికి మద్దతు ధర అందించలేకపోయినప్పుడు వెంటనే పదవికి రాజీనామా చేస్తానని ఎన్‌డీఏ మిత్రపక్షం జేజేపీ అధ్యక్షుడు చౌతలా ప్రకటించారు. రైతులకు మద్దతు ధర తప్పకుండా కల్పించాలని ఇప్పటికే తమ పార్టీ నేతలు స్పష్టం చేశారని, ప్రభుత్వం రైతులకు పంపిన లిఖితపూర్వక సవరణల ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధర హామీ కూడా ఉన్నదని వివరించారు.
మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంలో తాను ఉపముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం రైతులకు మద్దతు ధర అందించడానికి కృషి చేస్తానని, అందించలేకపోయిననాడు ప్రభుత్వానికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. కేంద్ర ప్రతిపాదనల్లో మద్దతు ధరను చేర్చినందున రైతులు తమ పోరాటం విజయవంతమైనట్టు భావించాలని, వెంటనే ఆందోళనలకు స్వస్తి పలకాలని సూచించారు. రాష్ట్రంలోని బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకోవాలని విపక్షాలు, రైతుల ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.