- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కష్టాలను అధిగమిస్తేనే లక్ష్యాన్ని సాధించగలుగుతాం.. రాము రాథోడ్..

దిశ, భూత్పూర్ : విద్యార్థులు.. చిన్నతనం నుంచే.. గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి.. ఆ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎన్నెన్నో కష్టాలు.. అవమానాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించి నప్పుడే మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని ప్రముఖ ఫోక్ సాంగ్స్ రచయిత, గాయకుడు, నృత్యకారుడు రాము రాథోడ్ అన్నారు. శనివారం భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలోని స్వామి వివేకానంద విద్యాలయంలో రాము రాథోడ్ కు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా రాము రాథోడ్ మాట్లాడుతూ తనకు నృత్యాలు అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం.. ఆ ఇష్టంతోనే.. పెండ్లిల్లు.. శుభకార్యాల వద్ద ఆడుతూ.. పాడుతూ ఉండేవాడినని,. ఈ క్రమంలో తనకు ఎన్నెన్నో అవమానాలు, విమర్శలు ఎదురయ్యాయన్నారు. కానీ తాను వాటిని పట్టించుకోకుండా.. తన లక్ష్యం వైపు.. అడుగులు వేశారన్నారు. ఆ లక్ష్యానికి చేరుకునేందుకు తనకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పోలోజు సత్యం, జంగి రెడ్డి, జయప్రకాష్ తదితరుల ప్రోత్సాహం లభించింది అని చెప్పారు. ఆ ప్రోత్సాహంతోనే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ.. ఈరోజు యూట్యూబ్ లో దుమ్ము రేపే రాను ముంబైకి రాను.. ఓ చిన్ని రాములమ్మ.. తదితర పాటలు రాశానని చెప్పారు.
మీ లోపల ఉన్న కళలను ప్రదర్శించండి.. వాటి ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశాలు తలుపులు తెరుస్తాయి అన్నారు. పుట్టిన గడ్డను మరువకుండా ఈ ప్రాంతానికి సాంస్కృతిక కార్యక్రమాల పరంగా తన సహాయ సహకారాలు అందిస్తానని వెల్లడించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు ఉగాది పండగను పురస్కరించుకొని కవితా పఠనం చేసి సంస్కృతిక ప్రదర్శనలు చేశారు. పాలమూరు జిల్లా ఖ్యాతిని తన పాట.. ఆట.. రచనలతో ప్రపంచానికి చాటిన రాము నాయక్ ను సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ సర్పంచులు నారాయణ గౌడ్, ఆర్య నాయక్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు టి.మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మేకల సత్యనారాయణ, సాదిక్, అహ్మద్, యాసీన్, కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, గోవర్ధన్ గౌడ్, బోరింగ్ నర్సింలు, లిక్కి విజయ్, మట్టి ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.