బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

by Kalyani |
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
X

దిశ,తిరుమలాయపాలెం: బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం గ్రామానికి చెందిన, బాతుల ఉపేందర్- ఉమా దంపతుల కుమార్తె ఉద్దీప (20). ఖమ్మం రూరల్ మండలంలోని పెద్ద తండాలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. గతంలో ఉద్దీప కింద పడగా తలకు గాయమై బ్లడ్ క్లాట్ అయింది. అప్పటినుంచి మెడిషన్స్ వాడుతున్న ఉద్దీప మానసిక స్థితి సరిగా ఉండడం లేదు. ఈ క్రమంలో ఉదీప గత కొన్ని రోజులుగా తిరుమలాయపాలెంలోని దగ్గర బంధువులైన మండల బిక్షం ఇంటి దగ్గర ఉంటుంది. శనివారం మానసిక స్థితి సరిగలేని ఉద్దీప,ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని, తల్లి ఉమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.

Next Story