రణరంగంగా మారిన రైతు ర్యాలీ

by Anukaran |   ( Updated:2023-04-13 17:30:02.0  )
రణరంగంగా మారిన రైతు ర్యాలీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు సింఘూ టిక్రీ, ఘాజీపూర్ మీదుగా ఢిల్లీకి చేరుకున్నారు. సరిహద్దుల్లో అడ్డుగా పెట్టిన వాహనాలను రైతులు ధ్వంసం చేశారు. బారికేడ్లను తోసుకుంటూ రైతులు ముందుకు వెళ్తున్నారు. ర్యాలీగా వెళ్తున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పలు చోట్ల రైతులపై లాఠీచార్జ్ చేశారు. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఢిల్లీ పోలీసు ప్రధాని కార్యాలయం ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుగా పెట్టిన వాహనాలపై రైతుల దాడి చేశారు. పోలీసులపై దాడికి యత్నించారు ఆందోళనకారులు. మరోవైపు ఆదాయ పన్ను కార్యాలయం వద్ద రైతులు బారికేడ్లను తోసేశారు. ల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ట్రాక్టర్లు వెళ్లకుండా రహదారిపై ఉంచిన డీటీసీ బస్సులను రైతులు తోసేశారు. ఇండియా గేట్, రాజ్‌పథ్, రాజ్‌ఘాట్ వైపు రైతులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతుల ర్యాలీలో దాడులు జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరికతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed