రైతులు రాస్తారోకో.. కారణం ఇదే

by Aamani |
రైతులు రాస్తారోకో.. కారణం ఇదే
X

దిశ, ఆదిలాబాద్: నాలుగైదు రోజులుగా బ్యాంకు చుట్టు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ఇచ్చోడ మండలం సిరిచల్మలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్బీఐ బ్యాంకులో రుణాలను రీ షెడ్యూల్ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అయితే బ్యాంకుకు ఇంటర్ నెట్ కనెక్టివిటీ లేకపోవటంతోనే ఆలస్యం అవుతుందని అధికారులు వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story