- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు వేదిక తరలింపుపై నిరసన దీక్ష
దిశ, దేవరకొండ: గ్రామం నుంచి రైతు వేదిక తరలించడంతో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ ఘటన డిండి మండలం కందుకూరులో చోటుచేసుకుంది. దీక్షలో బీజేపీ మండలాధ్యక్షుడు వానం నరేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మైనోద్దీన్ పాల్గొని మాట్లాడారు. ‘‘రైతు వేదికల మార్గదర్శకాలకనుగుణంగా జూన్ 27న కందుకూరు గ్రామాన్ని ఎంపిక చేసి ప్రభుత్వ భూమిలో పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ హద్దులు ఏర్పాటు చేశారు. కాని కందుకూరులో బీజేపి సర్పంచ్ ఉన్నాడన్న ఏకైక కారణంతో స్థానిక ఎమ్మెల్యే అర్హత లేని మారుమూల శాంతిగూడెం గ్రామానికి రైతు వేదికను తరలించమని కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి మార్పించారు. సుమారు 20 లక్షల రుపాయలతో నిర్మిస్తున్న భవనం సర్పంచ్ క్యాంప్ ఆఫీస్‌గా మిగిలిపోవడం ఖాయం.’’ అని వారు అన్నారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అనడానికి ఇదొక మంచి ఉదాహరణని, కందుకూరులో లేని సదుపాయాలు శాంతిగూడెంలో ఉన్నాయా? కందుకూరుకు కేటాయించిన రైతు వేదికను శాంతిగూడెంకు తరలించడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఎమ్మెల్యే, సర్పంచ్ ల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని బహిర్గతం చేయ్యాలని వారు డిమాండ్ చేశారు. దీక్షలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి, రామకృష్ణ చెన్నకేశవ, ప్రసాద్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.